బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించి గ్రామంలో ఇంటి ఇంటికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘కమలం పువ్వు’ గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ని గెలిపించాలని ప్రజలను కోరారు.శనివారం ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ… ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృధి చెందింది అని మరియు అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మోదీ ది అని రఘునాథ్ అన్నారు. దేశ ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ కి అధికారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే ఓటు వృధా అయినట్టే అని గత 100 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేదని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహిళలకు నెలకు 2500 రూపాయలు,2 లక్షల రూపాయలు రుణ మాఫీ, నిరుద్యోగులకు 4000 రూపాయలు భృతి,స్వంత ఇండ్లు వంటి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు.దేశంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం పని చేసే బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, వెల్గనూర్ ఎంపీటీసీ చుంచు మల్లవ్వ లక్ష్మీనారాయణ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మోర్పుటాల సంజీవ్,ప్రధాన కార్యదర్శులు ఎంబడి సురేందర్, సిపిరి శెట్టి శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు బండే సత్యం, కర్నాల కిషన్,పత్తిపాక సంతోష్, మాజీ ఉపసర్పంచ్ గాలి పెళ్లి సత్యం,మండల కార్యదర్శి కొత్తపెళ్లి రాజేశం,గుర్రం రాజన్న, కాశెట్టి లచ్చన్న పి ఏ సీ ఎస్ గూడెం చేర్మెన్ బెడద సురేష్,వైస్ చైర్మన్ చుంచు సతీష్,కన్నెపల్లి మ్యాదరపేట తాజా మాజీ సర్పంచులు గడిగొప్పుల రజిని సురేందర్,డంక లక్ష్మణ్,మాజీ వైస్ చైర్మన్ చిట్ల శ్రీనివాస్, మండల కార్యదర్శి మాజీ ఉపసర్పంచ్ దుమ్మని సత్తయ్య, మండల కార్యదర్శి గోపె రాయమల్లు,బీజేవైఎం మండల అధ్యక్షులు ఎర్రం నరేష్,ప్రధాన కార్యదర్శి దార శేఖర్,ఎస్టీ మోర్చ బోడ సత్యనారాయణ,మండల డైరెక్టర్ లక్కకుల బుచ్చన్న, మండల కార్యవర్గ సభ్యులు కాండ్రపు ఏసయ్య,బూత్ అధ్యక్షులు పంచేర్పుల సత్యం, గౌరి శెట్టి సంతోష్,బొడ అంజన్న, తిరుపతి,జంబోజు వంశీ,గోపతి సాంబయ్య,రాకేష్ వర్ధన్,కిషన్, కాంద్రపు మల్లేష్,మెడిశెట్టి కిషన్,తదితరులు పాల్గొన్నారు.