ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు.

నియోజకవర్గంలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 23

ఈరోజు హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడాని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ కి భారతరత్న అవార్డు ఇవ్వాలని ట్యాంక్ బండ్ పై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. నేటి విద్యార్థి లోకం భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, మండల కార్యదర్శి జూపక శివమణి, మండల అధ్యక్షులు దొమ్మాటి వేణుగోపాల్, అరుణ్, కుమార్ రాఘవ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking