“నకిలీ “అస్సెస్ మెంట్లతో ఇంటి పర్మిషన్లు..?

 

మునిసిపల్ ఆదాయానికి గండి..
అక్రమార్కుల జేబుల్లోకి సొమ్ము

కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ..?

జగిత్యాల మునిసిపల్లో దందా

జగిత్యాల, మార్చి 15,(ప్రజాబలం ప్రతినిధి) సరైన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా..లక్షల రూపాయల పన్నులు కట్టకుండా ఇంటి నిర్మాణ అనుమతులు ఇప్పించేందుకు కొందరు సిద్ధమయ్యారు. అక్రమ మార్గంలో నకిలీ అస్సెస్ మెంట్ కాగితాలను తయారుచేసి అవిజతచేసి ఇంటి నిర్మాణ అనుమతులు ఇప్పిస్తూ వేలాది రూపాయలను వెనకేసుకొంటున్న సంఘటన జగిత్యాల మునిసిపల్ లో జరుగుతున్నట్లు తెలిసింది. మునిసిపల్ నిబంధనల ప్రకారం ఒక పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లును కూల్చి కొత్త ఇల్లు నిర్మాణ అనుమతులు పొందాలంటే ఆ ఇంటికి చెందిన 1980 నుంచి అస్సెస్ మెంట్ కాపీలను మునిసిపల్లో ఇంటి నిర్మాణ అనుమతికై జతచేయాలి. అలాగే బ్యాంక్ లోను సందర్భంలోనూ ఈ అస్సెస్ మెంట్ కాపీల అవసరం వుంటుందన్నట్లు సమాచారం. కాగా కొందరి పాత ఇంటికి చెందిన అస్సెస్ మెంట్ వివరాలు మునిసిపల్ రికార్డుల్లో లేనట్లు సమాచారం. ఇలాంటి సందర్భాల్లో ఆ ఇంటి యజమాని ఎల్.ఆర్.ఎస్.కింద 14 శాతం చొప్పున ప్రభుత్వానికి ఫీజ్ రూపంలో లక్షలాది రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. ఇదే క్రమంలో ఎల్.ఆర్.ఎస్. చెల్లించిన వారికి బ్యాంక్ లోను దొరకడంలోను సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇలాంటి బాధితుల కోసమే మునిసిపల్ లోని కొందరు నకిలీ ఎస్సెస్ మెంట్ కాపీలను తయారు చేయించి ఎల్.ఆర్.ఎస్.రూపంలో మునిసిపల్ కు చెల్లించాల్సిన లక్షలాది రూపాయలను చెల్లించకుండా ఇందులో తమవాటా తీసుకొని అంటగడుతున్నట్లు తెలిసింది. ఇలా నకిలీ అస్సెస్ మెంట్ కాపీలతో అనుమతులను కొందరు పొందినట్లు సమాచారం. కేవలం నకిలీ అస్సెస్మెంట్ కాపీలను సృష్టిస్తున్న సదరు అక్రమార్కులు ఏకంగా అప్పుడు పనిచేసిన కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి వీటికి సజీవ రూపం కల్పించినట్లు తెలిసింది. గతంలో పనిచేసిన మునిసిపల్ కమిషనర్ల హయం నుంచి కొనసాగుతున్న ఈ దందాతో కొందరు మునిసిపల్ ఖజానాకు గండికొట్టి లక్షలాది రూపాయలను వెనకేసుకొన్నట్లు తెలిసింది. ఇలా నిరాటంకంగా సాగుతున్న నకిలీ ఎస్సెస్ మెంట్ కాపిల దందాలో ఇటీవలే సంబంధిత అధికారికి ఒక ఇంటి నిర్మాణానికి జతచేసిన అస్సెస్ మెంట్ కాపిలపై వచ్చిన అనుమానంతో అప్పటి కమిషనర్ ను ఫోన్ లో సంప్రదించి ఈ కాపీలపై ఉన్న సంతకంపై ఆరా తీసినట్లు సమాచారం. దీంతో నకిలీ అస్సెస్ మెంట్ కాపిల భాగోతం వెలుగులోకి రావడం ఈ అక్రమార్కుడిపై సదరు కమిషనర్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా నకిలీ అస్సెస్ మెంట్ కాపీలనును గుర్తించిన సదరు అధికారి ఇంకెన్ని నకిలీల తో అనుమతులు పొందరో అన్న కోణంలో మిగతా వాటిని ఇంకా గుర్తించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో సదరు అధికారికి ఎలాంటి సంబంధం లేనిచో మునిసిపల్ ఆదాయాన్ని పెంచే దిశలో పాత అస్సెస్ మెంట్లపై గత కమిషనర్ల సంతకాలపై నిజానిజాలను నిగ్గుతేల్చి మరికొన్నైనా వెలికి తేయాల్సిన అవసరం ఉండగా ఒకే నకిలీ అస్సెస్ మెంట్ అనుమతి దరఖాస్తును ముందుంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలనాపరమైన సమస్య నేడు జగిత్యాల పురపాలికలో నెలకొని పట్టణ ప్రజలకు అభివృద్ధి ఆటంకం ఏర్పడుతుండగా మునిసిపల్లోనే ఖజానాకు గండికొట్టే అక్రమార్కుల పనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking