కేత్లాపుర్ కూకట్ పల్లి లో ధర్మశాల భవన సముదాయమును ప్రారంభించిన హానరబుల్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 15:
మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూకట్ పల్లి , బాలానగర్ మరియు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి శేరిలింగంపల్లి యొక్క సివిల్ , ఫ్యామిలీ , క్రిమినల్ ధర్మశాల భవన సముదాయము ఈ – సేవ తో కూడిన ఆధునిక సదుపాయాలతో నిర్మించబడిందని.
ఇప్పటివరకు విచారణ జరగని కేసుల సంఖ్యా 42,000 పైచిలుకు ఉన్నందున వాటిని పరిష్కరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించుకుంటూ పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని పక్షపాతంలేని పారదర్శకంగా న్యాయమైన, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వాలని కోరారు. నూతనంగా నిర్మించిన కోర్టును తమ సొంత ఇంటిలా భావిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు న్యాయం అనేది సులభంగా ప్రజలందరికి చేరువలోకి రావాలని కోరారు.
పాత కేసులు మొదలుకొని రోజువారీ కేసులను డిజిటలైజెషన్ చేసి భద్రపరచాలి అని అన్నారు కోర్టు ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించడానికి మనమందరం కృషి చెయ్యాలని హానరబుల్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జస్టిస్ లక్ష్మణ్ , జస్టిస్ విజయ సేన్ రెడ్డి, జస్టిస్ శ్యామ్ ఖోస్ , జస్టిస్ అభినందన కుమార్ శావిలి , జస్టిస్ వినోద్ కుమార్ , జస్టిస్ బాల భాస్కర్ , జస్టిస్ శశిధర్ రెడ్డి , మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు IAS , సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మొహంతి IPS , మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.