ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్న ఎస్ ఐ శివానందం.

 

మెదక్ తూప్రాన్ 15 ఆగస్ట్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ శివానందం, హెడ్ కానిస్టేబుల్ ధర్మేందర్ ఉత్తమ పోలీస్ సేవ ప్రశంస పత్రం అందుకున్నారు.
గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖలోని వివిధ భాగాల్లో పోలీస్ వీధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తూప్రాన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ( ఎస్ఐ) శివానందం కు ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడు డాక్టర్
కే. కేశవరావు మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి , అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా అధికారుల చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రం, అవార్డు అందుకున్న ఎస్ ఐ శివానందం, హెడ్ కానిస్టేబుల్ ధర్మయ్య, సురేష్ బాబు, దేవదాస్, భాస్కర్, ఎండి తస్లిమ్, పోలీస్ అధికారులు,
మండలంలో పలు సేవా రెవెన్యూ డివిజన్ కేంద్రంలో పలు సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేగాక స్థానిక సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచారు. ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న ఎస్ ఐ శివానందం పై అధికారులకు తమ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివానందం కు స్థానికులు ప్రజాప్రతినిధులు , నాయకులు , గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking