ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ నుండి రాజీవ్ గాంధీ ఏర్ పోర్టు డ్యూటీ చేయుచు బస్ ఏర్ పోర్టు చేరింది.బస్సు ఖాళీ అయిన తర్వాత డ్రైవర్ అసదుల్లా 851051 బస్ చెక్ చేయగా సీటు పైన పర్సు దొరికింది.తెరిచి చూడగా రెడ్మి సెల్ ఫోన్ 3160/-నగదు కనుగొన్నాడు. ఫోన్ లో మిస్ కాల్ లు చూసి సార్ నేను బస్ డ్రైవర్ ను మాట్లాడుతున్నాను.మీరు ఈ పర్స్ బస్సులో మరిచిపోయారు.మీరు రేపు ఉదయం10 గం!!లకు జే. బి.ఎస్.బస్టాండ్ కు రండి అని చెప్పి జె బి ఎస్. లో ఎస్ ఎం సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ నిర్మల్ కంట్రోలర్ పోశెట్టి సమక్షంలో వివరాలు తెలుసుకొని పర్స్ చెక్ చేసి సదరు ప్రయాణికుడు పడగల్ కు చెందిన ఐ. రాజ్ కుమార్ కు అప్పచెప్పడం జరిగింది.నిజాయితీగా పర్స్ అప్పగించిన అసదుల్లా 851051 డ్రైవర్ ను అధికారులు ప్రయాణికులు అభినందించారు