ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 13
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం జి.ఎం జి.దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, మందమర్రి ఏరియాలోని ఆర్కే ఓసిపి కాలరీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న సుదీర్ జక్కులవార్ మందమర్రి ఏరియా నుండి జీడీకే _1 ఏరియాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా మందమర్రి ఏరియ జనరల్ మేనేజర్ జి.దేవేందర్, ఉన్నతాధికారులు జ్ఞాపికను అందజేసి, శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ, ప్రతి ఒక్క అధికారికి ఉన్నత పదవులు రావడం ఉన్న స్థలము నుండి వేరొక స్థలంలోకి బదిలీపై వెళ్లడం అనివార్యమని అన్నారు. ఈ సందర్భంగా సుదీర్ జక్కులవార్ మందమర్రి ఏరియాకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ్ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, జనరల్ మేనేజర్ కార్యాలయం మరియు అన్ని గనుల, అన్ని డిపార్ట్మెంట్ల హెచ్.ఓ.డి లు, అధికారులు, పాల్గొన్నారు.