హౌసింగ్ బోర్డ్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే…కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్)
మే:06
కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అల్పాదయ వర్గాలు ఫేస్ 2 లో పార్టీలకు చెందిన నాయకులు కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీతోపాటు ఫోర్త్ ఫేస్ లోని వెంచర్ 2 లో నెలకొన్న సమస్యలను ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామని ఆయన అన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని, ఈ సందర్భంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో స్థిర పడిన 26 కులాలను అన్యాయంగా ఓసి జాబితాలో చేర్చారని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి ఆకర్షితులై శెట్టి బలిజ ఉద్యమ నాయకురాలు ధనలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్ గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కుమార్తె మనిషా రెడ్డి ధనలక్ష్మికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇతర పార్టీల చెందిన పలువురు మహిళా నాయకురాళ్ళు పుష్ప వేణి, కృష్ణ కుమారి, దేవి, పద్మ, లక్ష్మి.. వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 26 కులాలకు చెందిన వారిని అన్యాయంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓసి కులాల్లో చేర్పించడం మూలంగా తమకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో చేరిన 26 కులాల పోరాట నాయకురాలు ధనలక్ష్మి తెలిపారు. తాము కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో పాల్గొన్నవారు శేరి సతీష్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, కోఆర్డినేటర్ సంధ్యారాణి, టి ప్రవీణ్ కుమార్ డివిజన్ అధ్యక్షులు, రజిత డివిజన్ అధ్యక్షురాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, మేకలు మైకల్, రాజేష్ గౌడ్, అప్పారావు, సూరిబాబు , అనిల్ రెడ్డి, శేషగిరిరావు, నితీష్ గౌడ్, సుందరి, తదితరులు పాల్గొన్నారు.