నా తొలి ఓటు రైతు బిడ్డ నామాకే

 

రాజకీయాల్లో నామ లాంటి నాయకుడు ఉండాలి

సత్తా ఉన్న నాయకుడు నామ

లా విద్యార్థి సాయి నిఖిల మనోగతం

ఖమ్మం ప్రతినిధి మే 06 (ప్రజాబలం) ఖమ్మం ప్రజా నాయకులు ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత రైతుబిడ్డ ఎంపీ నామ నాగేశ్వరరావు కే తన తొలి ఓటు వేసి తన మద్దతు తెలియజేస్తానని న్యాయవాద విద్యార్థి తోటకూరి సాయి నిఖిల అన్నారు తొలిసారి ఓటు వేసే అవకాశం దక్కించుకున్న లా స్టూడెంట్ సాయి నిఖిల సోమవారం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును ఆయన స్వగృహంలో కలిసి ఆయనకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు రాజకీయాలలో నామ లాంటి వ్యక్తి ఉండాలని అమె అన్నారు మూడోసారి పార్లమెంట్‌ లో నామ అడుగు పెట్టి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు అందుకోసమే టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు తన మద్దతు తెలియ జేస్తున్నానని ఆమె తెలిపారు తెలంగాణా ప్రయోజనాలు, ఖమ్మం జిల్లా ప్రయోజనాలు నెరవేర్చడం లో నామ కృషి అనిర్వచనీయ మైందన్నారు. జిల్లా సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడే ధైర్యం, సత్తా ఉన్న నాయకుడు నామ అని అన్నారు. నామ లాంటి ఉత్తమ పార్ల మెంటేరియన్ పార్లమెంట్ లో ఉంటేనే జిల్లా ప్రజలకు గౌరవమని చెప్పారు నామతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా శాలువాతో నామను సన్మానించి అభిమానం చాటుకున్నారు సాయి నిఖిల ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గొల్లపూడి రామారావు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking