నేడు ఖమ్మానికి వెంకీ మామ రాక !

 

ఖమ్మం ప్రతినిధి మే 6 (ప్రజాబలం) ఖమ్మం సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఈ నెల 7వ తేదీన మంగళ వారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించ నున్నారు ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రామసహాయం రఘు రాం రెడ్డి కి వియ్యంకుడు కావడంతో ఆయన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు వస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5గంటలకు ఖమ్మం మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షో లో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 8గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్ లో జరిగే పుర ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకటేష్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై వెంకటేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking