ఖమ్మం ప్రతినిధి మే 6 (ప్రజాబలం) ఖమ్మం ఖిల్లా బాగ్ లో మైనార్టీ మహిళా ఆత్మీయ సమ్మేళనం జిల్లా మైనార్టీ నాయకులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సప్ని రెడ్డి ఆశ్రిత మాట్లాడుతూ పొంగులేటి శ్రీనన్న ఎలా అయితే ప్రజలకు సేవ చేస్తు అందు బాటులో ఉంటున్నారో అదే విధంగా మా మావయ్యా రఘురాంరెడ్డి కూడా అందరికీ ఎల్లపుడూ అందు బాటులో ఉంటూ సేవ చేస్తారని ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా శౌకత్ ఆలీ మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకూ 6 పథకాల లో అయిదు అమలు చేస్తుందని అవి అందని అర్హులు ఉంటే వారికి అందే విధంగా కృషి చేస్తానని కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని తెలిపారు షేక్ జిలాని మాట్లాడుతూ దేశంలో హిందు ముస్లిం లు అన్న దమ్ముల కలసి మెలసి ఉండాలంటే ప్రతి ముస్లిం కాంగ్రెస్ కు ఓటు వేసి రఘురాంరెడ్డి ని గెలిపించి రాహూల్ గాంధీ ని ప్రధాని చేయాలని కోరారు ఈ కార్య క్రమంలో రామ సాయం అర్జున్ రెడ్డి తో పాటు మాజీ కార్పొరేటర్ శౌకత్ అలీ, కార్పోరేటర్ అలియా శౌకత్ ఆలీ డివిజన్ ప్రెసిడెంట్ గౌస్ ముక్రమ్ అన్ అఫ్సర్ ముకీమ్ గఫూర్ గౌస్ సలీం ఎక్సైజ్ తదితరులు పాల్గొన్నారు
