బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు
తాండురు ప్రజాబలం ప్రతినిధి:తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ 9వ వార్డ్ లో గడప గడపకు బీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమం….
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా 9వ వార్డ్ సాయిపూర్ లో బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాల తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత 420 హామీలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు వేసి జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది.
