రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ITAP AWARDS-2023

ఉత్తమ ఉపాధ్యాయులకు ఐడియల్ టీచింగ్ అవార్డ్ ప్రొగ్రామ్ ( ఐటాప్ 2023) పేరిట అవార్డుల ప్రధానం

భోధనలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన ఉపాధ్యాయులకు రాజా రత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అవార్డులు ప్రధానం చేయనున్నది. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అకడమిక్ నాన్ అకడమిక్ టీచర్లకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. ప్రముఖ ఆన్ లైన్ ట్యూటరింగ్ కంపెనీ ఆన్లైన్ కెరియర్ డాక్టర్ వారి సహకారంతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులతో పాటు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, స్పోర్ట్స్ కోచ్ లు, విభిన్న కళలను నేర్పించే కళాకారులతో పాటు గురువులు, మెంటార్ లు ఈ అవార్డు పొందడానికి అర్హులు.

ఈ ఐటాప్ 2023 అవార్డుకు 25-09-2023 వరకూ నామినేషన్ వేసుకునేందుకు అవకాశం ఉంది. విభిన్న రంగాల్లో గొప్పవాళ్లైన 7 మంది జ్యూరీ సభ్యులు నామినేషన్లను పరిశీలించి అవార్డులను ప్రకటిస్తారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం తేది 02-10-2023 న జరగనుంది. ఈ అవార్డుకు నామినేషన్ చేసుకోవాలనుకున్నవాళ్లు www.itapawards.com వెబ్ సైట్ ను సందర్శించి నామినేషన్ వేసుకోవచ్చు. అలాగే మరిన్ని వివరాలు కావాలనుకుంటే 89781 74444 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు.

పై వివరాలను ప్రెస్ మీట్ లో పాల్గొన్న డాక్టర్ వెంకట్ బార్ల గారు చైర్మన్- ITAP23 మేనేజ్మెంట్ కమిటీ, శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు ITAP-ఫౌండర్ మెంబర్ మరియు శ్రీ కె. రామారావు గారు సభ్యుడు ITAP23 మేనేజ్మెంట్ కమిటీ, వారు తెలియజేశారు.

రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking