- సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్.
- పీవీఆర్ గార్డెన్స్‌లో సిబ్బందికి పోలీస్ అధికారుల సూచనలు
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 30 మంగళవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కాంగ్రెస్ ‘జన జాతర సభ’ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, అడిషనల్ డీసీపీ ఆర్మ్‌డ్ రిజర్వ్ అకున్ కుమార్, ఏసీపీలు శ్రీనివాస్ జి, సుందర్ రావు..జమ్మికుంట పట్టణంలోని పీవీఆర్ గార్డెన్ పోలీస్ సిబ్బందికి సభ నిర్వహణపై తగు సూచనలు చేశారు. బందోబస్తు జాగ్రత్తలు తెలిపారు. సుమారు 300 మందితో సభకు బందోబస్తు నిర్వహిస్తునట్టు అధికారులు స్పష్టం చేశారు.