రాజ రాజన్న సిరిసిల్ల జిల్లా , 29 ఏప్రిల్ 2024 , ప్రజాబలం ప్రతినిధి , మొన్నటి రోజున పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి బట్ట పైన GST వేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం బిజెపి వచ్చే జీఎస్టీ స్టార్ట్ చేసింది అని చెప్పిండ్రు జిఎస్టి అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి ప్రపోజల్ పెడతానే ఉన్నారు వాళ్ళతోని ఇంప్రూవ్మెంట్ చేయడం వాళ్ళ వల్ల చేతకాలె మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి వాళ్లతోనే చేతకాకుండా పక్కకు పడిన దాన్ని నరేంద్ర మోడీ దాన్ని కంప్లీట్ గా అమలు చేసిండు అని మీకు తెలియజేస్తున్న పొన్నం ప్రభాకర్ గత రాష్ట్ర ప్రభుత్వం GST రిఫండ్ ఇయ్యాలే ఇప్పుడు మరి మీరు ఇస్తున్నారా ఇస్తలేరా తెలువది అదేదో నా పాత బకాయిలు ఏన్నీ ఉంటే అన్ని మీరు వ్యాపారులకు వెంబడే 7% GST రిటన్ ఇచ్చి మీరు ఏదైనా చెప్పాలె లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము GST టెక్స్టైల్ పైన తీసేస్తున్న అని ప్రకటించి GST కౌన్సెల్ కు ఒక లెటర్ ముఖ్యమంత్రి చే రాయించి GST పూర్తి భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఒక లెటర్ రాసిన తర్వాత GST మీద పొన్న ప్రభాకర్ మాట్లాడాలి.
పొన్నం ప్రభాకర్ GST గురించి మాట్లాడుతాడు గాని ఆయనకు గతంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాట్ రెడీమేడ్ బట్టల పైన 28% ఉండే మరి అప్పుడు తెలవదా ఆయనకు మల్ల తర్వాత నూలు మీద 18% నుంచి 24% వ్యాట్ ఉండే ఇవన్నీ పొన్నం ప్రభాకర్ తెలుసుకోవాలి
సిరిసిల్ల బతుకమ్మ చీరలు 270 కోట్లు బకాయలు రెండు ప్రభుత్వాలు కలిసి సిరిసిల్ల కు ఆకలి చావులు తెచ్చి నేత కార్మికులు ఉరేసుకోవడానికి కారణము
అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణము మీకు చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్ల నేత కార్మికులకు ఏదైనా ఇస్తా అంటున్నావ్ కదా వారం లోపట మొత్తం 270 కోట్లు ఇచ్చి నువ్వు సిరిసిల్లకు రా మాకు ఓట్లు వేస్తేనే డబ్బులు ఇస్తాం అని మాట్లాడతావా గత ప్రభుత్వం కూడా ఇలాగే బెదిరించి ఓట్లు వేయించుకుంది వాళ్లకు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది
బతుకమ్మ చీరలకు సంబంధించిన 270 కోట్ల బకాయిలలో 50 కోట్లు ఇస్తా మళ్లీ ఇస్తా అని చెప్పడానికి నువ్వు మాకు ఇచ్చేదేమన్నా బిచ్చమా మేము కష్టపడి నేసి ఇచ్చిన బట్టకు మా కష్టం రూపాలు 270 కోట్లు వెంబడే రిలీజ్ చేసి మాట్లాడు
నువ్వు GST మీద మాట్లాడాలంటే GST కౌన్సిల్ లెటర్ రాసి సిరిసిల్లకు రా నీతో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాం
భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శిలు కైలాష్ కొండ నరేష్ ఎనుగంటి నరేష్ పత్తిపాక సురేష్ పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుంకరి బాలకిషన్ పట్టణ కోశాధికారి చొప్పదండి శ్రీనివాస్ మహేశుని అనిల్ అంకారపు రాజు గుడ్ల సురేష్ అనిల్ రాజు పోసెట్టి శేఖర్ బాలసాని అనిల్ తదితరులు పాల్గొన్నారు