న్యాయమూర్తులకు వెల్కమ్ – వీడ్కోలు .

కరీంనగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అరుణ హైదరాబాద్ కు బదిలీ అయిన సందర్భంగా ఆమెకు వీడ్కోలు, కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ కు స్వాగత కార్యక్రమాన్ని సోమవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలోని మీడియేషన్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి బి ప్రతిమ ముఖ్య అతిథిగా హాజరై నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భార్య భర్తల విడాకుల కేసులలో జడ్జి అరుణ చూపిన చొరవను ఆమె కొనియాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జడ్జి వెంకటేష్ కేసుల పరిష్కారంలో ఎక్కువ చొరవ చూపాలని తెలిపారు. బదిలీపై వెళ్తున్న జడ్జి అరుణ మాట్లాడుతూ ఇక్కడి న్యాయవాదులు, జిల్లా జడ్జి ఇతర న్యాయమూర్తుల సహకారం మర్చిపోలేనిదని తెలిపారు.

Welcome - Farewell to the judges.

ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు జడ్జి అరుణ కేసుల విచారణలో చూపిన చొరవ ,జూనియర్ న్యాయవాదులకు ఆమె అందించిన సహకారం గూర్చి వివరించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు రఘువీర్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు జడ్జి వెంకటేష్ కు స్వాగతం పలుకుతు సన్మానం చేయగా, జడ్జి అరుణను ఘనంగా శాలువ మెమంటోలతో సత్కరించి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీనియర్ జూనియర్ మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking