దేశానికె గర్వ కారణ మైన ఎన్నికల పర్వంలో ఓటు అనే వజ్రాయుధాన్ని వృధా పరచవద్దు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 30 ఎప్రిల్ 2024:
భారత దేశ ప్రజా స్వామ్యంపై విశ్వాసంతో సత్ సాంప్రదాయాలను జాతి మత వేష భాష కుల వర్గ ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేయడానికి ముందుకు రావాలని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న నార్శింగి మునిసిపల్ కౌన్సిల్ కమీషనర్ శరత్ చంద్ర అధ్యక్షతన మణికొండ కౌన్సిల్ అంతర్భాగమైన అలకాపురి టౌన్షిప్ నందు గల మహత్మా గాంధీ పార్క్ లో ఎప్రిల్ 30 మంగళవారం రోజున ఓటర్ అవగాహణ సదస్సులో పిలుపునిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడ మైనదనీ ఇందులో స్థానిక అల్కాపూర్ అధ్యక్షుడు వంశీ, హ్యూమన్ రైట్స్ సభ్యుడు శ్రీనివాస్ మీనన్ తది తర కాలనీ వాసులు, ఆల్ కాలనీ ఫెడ్రేషన్ కార్యదర్శి ఆంజనేయులు, సభ్యుడు కాంతారావు, వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు తరపున మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు, కోశాధికారి దిలీప్ కక్కడ్ లు హాజరై తమ తమ విలువైన అభిప్రాయములు తెలియ పరచుతూ ప్రత్యేకముగా ఎన్నికల సందర్భంగా 11మే న రెండవ శనివారమనీ 12న ఆదివారమని 13న సెలవుతో కూడిన ఎన్నికలు ఉన్నవని, వరుస సెలవులను సాకుగా చూపుతూ తుచ్ఛమైన లాలూచీ లకు లోనూ కాకుండా ఎన్నికలలో మీ యొక్క అమూల్య మైన ఓటు వేసీ దేశ పౌరునిగా ఓటు అనే ఆయుదాన్ని వాడి దేశ పౌరునిగా ముందుండాలని, ఇదే తరహా రాబోయే మే 5 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు మళ్లీ జరిగే ఓటర్ అవగాహణ సదస్సుకు కలసి కట్టుగా మణికొండ వాసులందరు హాజరవ్వాలని నోడల్ అధికారి శరత్ చంద్ర తెలియ పరచడమైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking