శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి

 

అధికారులకు,సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటాం

పోలీస్ కమీషనర్ ఐపిఎస్(ఐజీ) ఎం.శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 30 : రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేసిన 4 ఎస్సై లు టి.విక్టర్ 1981 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 42 సంవత్సరాల 6 నెలల సర్విస్,ఎన్.సురేందర్ 1983 బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికై 40 సంవత్సరాల 9 నెలల సర్విస్,టి.గంగరాజు గౌడ్ 1983 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 40 సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీస్,ఎన్.లింగాన్న 1989 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 35 సంవత్సరాల ఒక నెల సర్వీస్ పోలీసు శాఖ లో అమూల్యమైన సేవలు అందించి ఈరోజు  పదవి విరమణ సందర్భంగా సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేసి రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ (ఐజీ) ఎం.శ్రీనివాస్ పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. మంగళవారం ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని,ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగ ణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, పదవి విరమణ పొందుతున్న నలుగురు ఎస్సై పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ,హెడ్ కానిస్టేబుల్ గా,ఏ ఎస్ గా, ఎస్సై గా పదోన్నతి పొంది సుధీర్ఘకాలంగా విధులు  నిర్వహించి 40 సంవత్సరాల పై చిలుకు సర్వీస్  పూర్తి చేసుకుని చేసిన సేవను మరువమని, పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి, ప్రజా  రక్షణ కోసం వీరు  పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని సిపి అన్నారు.విధి నిర్వహణలో పగలనక, రాత్రనక,పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు.పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో  తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని  సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఎస్ఐ లకు ప్రభుత్వం నుంచి  రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మీకు ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,ఏఆర్ ఏసీపీ సురేంద్ర, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు రమేష్ బాబు, ప్రేమ్ కుమార్,ఏఓ అశోక్ కుమార్,సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి,సంధ్య, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking