అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు
రామగుండం కమిషనర్ ఐపిఎస్ (ఐజీ) ఎం శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 30 : సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల,పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఏపీఎస్(ఐజీ) ఎం.శ్రీనివాస్, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపడం జరిగింది.మద్యం సేవించి వీధుల్లో రోడ్ల పైన అసభ్య పదజాలంతో మాట్లాడటం,అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణ మిoచిoదని,మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ నిషేధాజ్ఞలు 2024-05-01 నుండి 2024-06-01 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. ఐపీసి188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం,ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.
డీజే ,డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల,పెద్దపల్లి జోన్ లలో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడగించమని అని సిపి తెలిపారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు,విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా,శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ,ప్రదర్శనల కోసంప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి ల అనుమతి పొందాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్ లో వినియోగించాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు 2024-05-01 నుండి 2024-06-01 వరకు కొనసాగుతాయని తెలిపారు.పరిస్థితుల ప్రభావం ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు.ఐపీఎస్ 188 హైదరాబాద్ నగర పోలీసు చట్టం,ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.