రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 30 ఎప్రిల్ 2024:
గవర్నమెంటు జిల్లా పరిషత్ హై స్కూల్ మణికొండలో 204 విద్యార్దులు పదవ తరగతి పరీక్షలు వ్రాయగా అందులో 86.27 శాతం అనగా 176 మంది ఉత్తీర్ణులైనారని, వారికి వారి తల్లి తండ్రులకు ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయునికి, ఉపాధ్యాలందరికి వీ ఆర్ 4 సాహయోగ్ చారిటబుల్ ట్రస్టు తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షల ఉత్తీర్ణత సరా సరి గ్రేడ్ పాయింట్లు 10 కి 10 సాధించిన కుశ్వంత్, 9.8 సాధించిన భార్గవి, మిర్యామి మరియు మొత్తంగా సరా సరి గ్రేడ్ పాయింట్లు 10 కి గాను 9 సాధించిన ఘనత 17 మంది విద్యార్థులు ఉన్నారని వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రాబోయే సమయంలో వీరు మున్ముందు చదువు కోవడానికి ఏ రకమైన సహాయం అయినా చేయడానికి తమ ట్రస్ట్ అన్నివిధాల ముందుంటుందని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలిపినారు.
