మూగజీవుల సేవా సంఘం రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో మూగజీవులకు ఆహారం అందించిన జంతు ప్రేమికులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 30 : మంచిర్యాల వాస్తవ్యులు భాగ్యలక్ష్మి మనవరాలి పుట్టిన రోజును పురస్కరించుకొని మూగ జీవుల సేవా సంఘం రామకృష్ణపూర్ వైస్ ప్రెసిడెంట్ సంగెం శ్రీధర్ ఆధ్వర్యంలో మూగజీవులకు ఆహారంగా అందించిన జంతు ప్రేమికులు.మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆవులకు పుచ్చకాయలు,దోసకాయలు, సొరకాయలు,బీట్రూట్,తౌడు పెసరి పొట్టు సమర్పించినారు. ఇట్టి ఆహారం రామకృష్ణాపూర్ రాజీవ్ ఛౌక్ కూరగాయల మార్కెట్ దగ్గర ఆవులకు పెట్టడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మూగజీవుల సేవా సంఘం రామకృష్ణాపూర్ సభ్యులు గంధం బాబురావు, వేముల హరీ ప్రసాద్,సంగెం శ్రీధర్,మర్రి స్వామి,కంచెర్ల శ్రీనివాస్,ఆవిడపు రాజశేఖర్, సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking