ఇల్లంతకుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 3
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఎస్ ఎస్ టి టీం సంయుక్తంగా చేసిన వాహన తనిఖీల్లో కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మీసాల రవి, తండ్రి మల్లయ్య అను వ్యక్తి 5,00,000/- రూపాయలతో వెళ్తుండగా ఎటువంటి ఆధారాలు లేకుండా అట్టి డబ్బును తీసుకెళ్తూనందూ వలన అట్టి 5,00,000/- రూపాయలు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ సిహెచ్ ఏసిపి శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎస్సై ఎన్ రాజ్ కుమార్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.