ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ కే

 

పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణని గెలిపిద్దాం

ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మేడి పాపయ్య

ప్రజాబలం మంచిర్యాల జిల్లా మార్చి 03 : ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ కే ఇస్తుందని,పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపయ్య,తుంగపిండి రాజేష్ కుమార్ మాదిగ సామజిక వర్గానికి,ప్రజలకు పిలుపునిచ్చారు.శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ…ఈ నెల 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 లోని హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.33 సంవత్సరాల యువకుడు విదేశాలలో చదువుకొని, అక్కడ అవకాశాలు వదులుకొని సొంత గడ్డపై ప్రజాసేవ కోసం సొంతగా కంపెనీ స్థాపించి నిరుద్యోగ యువతి,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలలో వెలుగును నింపిన గొప్ప వ్యక్తి వంశీ అన్నారు. స్వర్గీయ గౌరవనీయులు దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకట స్వామి ఆశయాలకు అనుగుణంగా వారి ఎరువుల కంపెనీ,పవర్ ప్లాంట్,రైల్వే సదుపాయాలు కల్పించారన్నారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగారపు రాజేష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకటి రవీందర్, హాజీపూర్ పట్టణ అధ్యక్షుడు వెలుగటూరు లచ్చన్న, బెల్లంపల్లి మండల అధ్యక్షులు సుద్దాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking