నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ
ఖమ్మం నియోజకవర్గ ప్రతినిధి జనవరి 3 (ప్రజాబలం) ఖమ్మం నియోజకవర్గం సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో అత్యద్భుతమైన మహా ప్రదర్శన తో పాటుగా ర్యాలీ జరిగినది తెలంగాణ తల్లితో, డప్పులతో, కోలాటాలతో, బతకమ్మలతో, నీటి బిందెలతో ఖమ్మం జడ్పీ సెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు, మయూరి సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వచ్చి అద్భుతమైన ప్రదర్శన చేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయా లు ఉట్టిపడే విధంగా ఖమ్మం పట్టణ ప్రజలను ఆకర్షించే విధంగా మహాద్భుతమైన ప్రదర్శన తో భారీ ర్యాలీ చేయడం జరిగింది ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద కోలాటాలతో బతకమ్మలతో డప్పులతో, నీటి బిందెలతో మహిళలు అద్భుతమైన కళా నృత్యాలు చేసి ఖమ్మం పట్టణ ప్రజలను ఆకర్షించే విధంగా సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రదర్శన చేయడం చాలా గర్వముగా ఉన్నది తెలంగాణ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బతకమ్మలు, కోలాటాలు వాటిని అద్భుతంగా ప్రదర్శించి తెలంగాణ ప్రజలతో పాటు, యావత్తు భారతదేశముతో పాటు, ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారికి అంకితం చేస్తున్నాము అనే ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమం లో షేక్ చాందిభి రాయల సంధ్య, రణబోతుల ఉమా, దిరిషాల ఉమా, మహేశ్వర పు మాధవి, సున్నం దీప్తి, దుగ్గిరాల కోటీశ్వరి, రేణుక, కల్వకుంట్ల శాంతి, సిహెచ్ నాగమణి, షేక్ సోనీ, ఊటుకూరు సింధు, నాగమణి, సుజాత, స్వరూప, వరలక్ష్మి, కవిత, రమా దేవి, సంగీత, జ్యోతి, శ్రీలక్ష్మి, రమాదేవి, సత్యవతి, రత్తమ్మ, ఈశ్వరమ్మ మొత్తం 162మంది సఖి జాతీయ మహిళా మండలి సభ్యులు పాల్గొని ఘన విజయం చేసినారు