జలంతోనే మానవ మనుగడ ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 28 : స్వచ్ఛమైన జలంతోనే మానవ మనుగడ సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి అన్నారు.మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోటీలు, సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….నీరు, పారిశుద్యంలో సమస్యల సాధనలో మార్పును వేగవంతం చేద్దాం అనే అంశంపై మానవ జీవితం లో ముఖ్యమైందన్నారు.ప్రభుత్వాలు పర్యావరణ కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు,ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు నీటి కోసం చేస్తున్న సంరక్షణ చర్యలను గురించి వివరించారు,విద్యార్థి లోకం పరిశుద్దమైన ప్రకృతిని కాపాడటంలో కార్యకర్తలుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. జైకిషన్ ఓజా మాట్లాడుతూ… జలసంరక్షణ చర్యలలో మన కాలేజీ భాగస్వామ్యం మరువలేదన్నారు. జలసంరక్షణపై ఉపన్యాస, పోస్టర్ ప్రజంటేషన్ షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించామని తెలిపారు. ఉపన్యాసంలో హర్శవర్ధిని వినీత్, యశస్విని షార్ట్ ఫిలింలో ప్రేమ కుమార్,వినీత్,అఖిల్,పోస్టర్ ప్రజంటేషన్ లో జ్యోతిక,సౌమ్య, మౌనికలు బహుమతులు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కో -ఆర్డినేటర్ గంగయ్య,అధ్యాపకులు కుమారస్వామి,సవిత,డా.సురేష్. డా.శ్రీలత,మంజుల,డా.రాజ్ కుమార్, శ్రీనివాస్,డా,చంద్రశేఖర్, సంద్యారాణి,కవిత, సత్యానారాయణ మహేష్ కుమార్, సతీష్ విజయ్,చెన్నూరు కళాశాల అధ్యాపకులు సర్వర్ పాషా, విద్యార్థులు,మంచిర్యాల మిమ్స్ కాలేజీ అధ్యాపకులు ఓదెలు విద్యార్థులు,లక్షెట్టిపేట కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking