ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 28 :మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ కౌన్సిలర్ రాజు ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని సమస్యలపై నస్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర బిజెపి శ్రేణులతో కలిసి భారీ ఎత్తున ప్రజలతో కలిసి ధర్నా మంగళవారం నిర్వహించారు, ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి మాట్లాడుతూ…అన్ని వార్డుల్లో నెలకోన్న త్రాగు నీరు,డ్రైనేజ్, రోడ్లు,విద్యుత్ తీగల సమస్యలు, మున్సిపాలిటీ శాశ్వత డంపింగ్ యార్డ్,ఓపెన్ జిమ్ లు,క్రీడ మైదానాలు,ప్రధాన కూడల్ల వద్ద మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినారు ఎమ్మెల్యే దివాకర్ రావు అండతో టిఆర్ఎస్ కౌన్సిలర్లు అవినీతికి పాల్పడుతున్నారని,మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం మరిచి మున్సిపాలిటీనీ అవినీతికి అడ్డాగా మార్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కౌన్సిలర్,రాజు బిజెపి కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.