మెదక్ ప్రజా బలం న్యూస్:-
మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కుమార్ ను సోమవారం తూప్రాన్ మండల పరిధిలోని ఘణపూర్ గ్రామ మున్నూరు కాపులు ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉధ్యక్షులు బట్టి జగపతి, కోఆర్డినేటర్ వీర్ కుమార్ ను కూడా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టి జగపతి మాట్లాడుతూ.. ఐకమత్యంతో ముందుకు సాగితే తమ హక్కులను సాధించుకోవచ్చన్నారు. మున్నూరు కాపులంతా రానున్న రోజుల్లో ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ కమిటీలను నియమించాలని జిల్లా అధ్యక్షుడికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఘణపూర్ గ్రామ మున్నూరు కాపులు కిరణ్ కుమార్, మహేష్, మహేందర్, మధుసూదన్, మహిపాల్, మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.