హైద్రాబాద్ ధర్నాకు తరలిన జగిత్యాల యూఎస్పీసి నాయకులు

 

జగిత్యాల ప్రతినిధి, మార్చి 28, (ప్రజా బలం)ఉద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి మంగళవారం యూఎస్పీసి ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నా కు జగిత్యాల యూఎస్పీసి నాయకులు తరలివెళ్లారు. ప్రతినెలా 1న వేతనాలు చెల్లించాలని అన్ని రకాల పెండింగ్ బిల్లులను మార్చి 31లోగా చెల్లించాలని, ఏయిడెడ్ ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని మరికొన్ని డిమాండ్ల సాధనే లక్ష్యంగా హైద్రాబాద్ మహాధర్నా తరాలుతున్నామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసి) జిల్లా నాయకులు బోగ రమేష్, ఏన్నం రాంరెడ్డి, అంబటి భూమేశ్వర్, కొక్కుల రాంచంద్రం, రాములు, పోచయ్య, పరుశురాం, శ్రీనివాస్, బాలయ్య, చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి తోపాటు పలువురు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking