మానవత్వం చాటిన మంత్రి పట్నం

 

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోజువారీ కార్యక్రమాల లో భాగంగా మంత్రి శనివారం శాబాద్ వెళుతుండగా
అజీజ్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా వివాహిత మృతి చెందిన సంఘటననూ గమనించారు.వెంటనే మంత్రి కాన్వాయ్ ఆపి ప్రమాద స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు.
ఘటన వివరాలు అక్కడ వున్న ట్రాఫిక్ పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
మృతురాలు చేవెళ్ల మండలం తంగడిపల్లీ కి చెందిన మహిళా అని పోలసులు తెలిపారు.
తగు చర్యలకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.బాధిత కుటుంబానికి ఆదుకుంటామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking