ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాన్ని పెంచాలని,హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మధ్యాన బోజన కార్మికులు మాట్లాడుతూ…చాలి చాలని జీతంతో బతకడం చాలా కష్టంగా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మమ్మల్ని ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం కార్మికులు పాల్గొన్నారు.