జేసి మాల్ ప్రారంభించిన హీరోయిన్ రీతు వర్మ

భారీగా తరలివచ్చిన జనం

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 7 (ప్రజాబలం) ఖమ్మం లో జె సి మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది అధునాతన అంగులతో రూపుదిద్దుకున్న జెసి మాల్ నూతన వస్త్రాలయం, సిల్వర్ జ్యుయలరీ షోరూమ్ లను ప్రముఖ సినీ తార రీతు వర్మ శనివారం ఖమ్మం గుమ్మంన అట్టహాసంగా ప్రారంభించారు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన జెసి మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ ను గ్రాండ్ గా ఆమె ప్రారంభిం చేందుకు ఖమ్మం విచ్చేయడంతో సినీనటి రీతు వర్మను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు ఇల్లందు క్రాస్ రోడ్డు ప్రాంతాలు జన సందోహంగా మారింది ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన నమ్మకమైన వస్త్రాలు, వెండి అభరణాలు అతి తక్కువ ధరలలో ప్రజలకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలని అన్ని పండగలు నూతన వస్త్రాలతో హ్యాపీగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు
అనేక దశాబ్దాలుగా జెసి మాల్ సరసమైన ధరలకు సరికొత్త డిజైన్లతో రూపొందించిన వస్త్రాలను, వెండి అభరణాలను అందుబాటులో ఉంచడం గొప్ప విశేషమని, ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కలకు చెందిన పలు జిల్లాల ప్రజలు ఆదరించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా దిగు దిగు.. దిగు దిగు ..దిగు నాగో. ఓ నాగో.. దిగు సుందరి నాగో అనే పాటకు రీతు వర్మ యాంకర్ బిగ్ బాస్ షో ఫ్రేమ్ కాజల్ తో కలిసి స్టెప్పులు వేసి ప్రేక్షకులను కనువిందు చేశారు అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. నవ్వుతూ ఆడి పాడి అభిమానులకు రెట్టింపు అయినా ఉత్సాహాన్ని అందించారు సినీ నటి రీతు వర్మను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు జన సందోహంతో నిండి పోయింది ఈ కార్యక్రమంలో జెసి మాల్ నిర్వహకులు కృష్ణారావు వెంకటరెడ్డి మర్రి జమున రెడ్డి మర్రి మధుమతి రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking