ఆస్తి పన్నుల వసూళ్ల లో మొదటి స్థానంలో హుజురాబాద్ మున్సిపాలిటీ

 

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చి 19

హుజురాబాద్ మున్సిపాలిటీ ఇంటి పన్నుల వసూళ్ళ లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆర్ధిక సంవత్సరం కు గాను 100 శాతం ఇంటి పన్నులు వసూళ్ళ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ర్టంలో 143 మున్సిపాలిటీ లు ఉండగా హుజురాబాద్ మొదటి స్థానంలో ఉండడడం గర్హనీయం. మున్సిపాలిటీ లోని 30 వార్డుల్లో 8917 నివాసాలు ఉండగా రూ.2 కోట్ల 64 లక్షల బకాయిలు ఉన్నాయి. గత రెండు నెలల క్రితం బదిలీ పై వచ్చిన సమ్మయ్య చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100 శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయడం లో సఫలీకృతం అయ్యారు. 8917 నివాసాల కు గాను రూ.2 కోట్ల 64 లక్షలు వసూళ్ళు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పోలీస్ శాఖ నుండి రూ.5 లక్షల 41 వేలు, కోర్టు బిల్డింగ్ ల ద్వారా రూ.3 లక్షల 80 వేలు, ఎంపిడివో కార్యాలయం ద్వారా రూ.1 లక్షల18 వేలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రూ.1 లక్ష 18 వేలు,చెల్లింపు లు జరిగాయి.వంద శాతం పన్నులు వసూళ్ళు జరిగిందున, 15 వ ఆర్ధిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. పట్టణ ప్రజలు 100 శాతం పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించినందున కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking