నిర్మల్ జిల్లా ఆరోగ్య కేంద్రాలకు జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్ రావడంపై అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
జిల్లాలోని నాలుగు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్ లభించిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి.బి, లక్ష్మణచందా మండలం మల్లాపూర్, ముధోల్ మండలం తరోడ,బాసర మండలంలోని కౌట నాలుగు ఆరోగ్య కేంద్రాలకు ఈ జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్లు లభించినట్లు తెలిపారు.జాతీయ స్థాయి బృందం అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, పలు నాణ్యత ప్రమాణాలను బేరీజువేసి ఉత్తమ నాణ్యత ప్రమాణాలు గల ఆరోగ్య కేంద్రాలుగా గుర్తింపును ఇచ్చినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు తమ పనితీరు కనబరిచి భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకాలు, అవార్డులు అందుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు