వేములవాడ మార్చి -19 (ప్రజా బలం)
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని బుధవారం రోజున బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు వేద పండితులు స్వస్తి తో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన కోడెముక్కును చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం ఆలయ ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట బిజెపి నాయకులు ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
