రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలి జిల్లా కలెక్టర్‌

అదిలాబాద్‌ జిల్లా ప్రజాబలం ప్రతినిధి:బుధవారం రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలని అన్నారు. రిమ్స్‌ వైద్య కళాశాలలో బుధవారం సాయంత్రం రిమ్స్‌ డైరెక్టర్‌ అధ్యక్షతన అన్ని శాఖల ప్రొఫెసర్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రిమ్స్‌ ఆస్పత్రికి వచ్చే వారందరూ పేద ప్రజలేనని పేదలను దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల డెలివరీస్‌ చేయాలని రిఫరల్‌ లేకుండా చూడాలని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు డెలివరీ నిమిత్తం వెళ్తున్నారని డెలివరీ కొరకు ప్రభుత్వ ఆసుపత్రి ,రిమ్స్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరం ఉన్న మహిళలకు టుబెట్టమి చేయడంలో ముందుండాలని తెలిపారు.

 


అన్ని శాఖల ప్రొఫెసర్ల ను వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో పేషెంట్లు ను చూసుకునేందుకు పేషెంట్‌ కేర్లు ఉన్నారని రోగులకు ఎలాంటి అవసరాలు ఉన్న పేషంట్‌ కేర్‌ ద్వారానే చేయించాలని తెలిపారు. ఎక్స్రే ఈసీజీ స్కానింగ్‌ రక్త పరీక్షలు తోపాటు అన్ని రకాల పరీక్షలకు సంబందించి ప్రొఫెసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
నర్సింగ్‌ కళాశాలలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఏ ఏ పోస్టు ఖాళీల ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ప్రిన్సిపాల్‌ సమాధానం ఇస్తూ ఇటీవల ఈ ఏడాది ఎంఎస్సీ నర్సింగ్‌ కొరకు అప్లై చేశామని తెలిపారు 8 మంది స్థాఫ్‌ నర్సులను టీచింగ్‌ ఫ్యాకల్టీ కోసం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఆర్‌ ఎం ఓ లు ఎంతమంది ఉన్నారు ఏమేం పని చేస్తున్నారు విధులు బాధ్యతలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ నీ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షల పెంచిందని ఆరోగ్యశ్రీలో పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ జయసింగ్‌ రాథోడ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేంద్ర రాథోడ్‌, ఆస్పత్రి సూపరిండెంట్లు డాక్టర్‌ అశోక్‌ డాక్టర్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking