హైదరాబాద్, ఫిబ్రవరి 7 ();: హోరాహోరీగా అహ్మదాబాద్ డిఫెండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు సెట్ల విజయం సాధించిన తరువాత హైదరాబాద్ బ్లాక్ హాక్స్ శిబిరం సంతోషించడానికి మరింత మహోన్నత కారణం దొరికింది. ఈ టీమ్ 2023 సీజన్ రూపే వాలీబాల్ లీగ్ కోసం నూతన జెర్సీని విడుదల చేసింది.ఈ జెర్సీ , చూడగానే ఆకట్టుకునే రీతిలో బ్లాక్ మరియు ఆరెంజ్ డిజైన్ కలిగి ఉంది. ఈ జెర్సీని తెలంగాణా రాష్ట్ర ఐటీ, పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి , వాణిజ్యం, పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ కె టి రామారావు ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా తెలంగాణా రాష్ట పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మరియు తెలంగాణా ఒలింపిక్ బాడీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.‘‘మన రాజధాని నగరంలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో క్రీడల వృద్ధికి అత్యంత కీలకంగా వ్యాపార సమాజపు మద్దతు నిలుస్తుంది’’ అని కె టి రామారావు అన్నారు. ‘‘ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తున్నాను’’అని అన్నారు.తెలంగాణా ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమానులు, వ్యాపారవేత్తలు అభిషేక్ రెడ్డి కంకణాల (ప్రిన్సిపల్ ఓనర్), శ్యామ్ గోపు (సహ యజమాని) సమన్వయం చేశారు. హైదరాబాద్ టీమ్‌లో అంతగా అనుభవజ్ఞులు లేకపోయినప్పటికీ వారాంతంలో అహ్మదాబాద్‌పై అత్యుత్తమ ప్రదర్శనను ఈ టీమ్ కనబరిచింది.