ఏఐఏఎస్ నాయకులు రమాబాయి ఘన నివాళులు
కోరుట్ల, ఆదర్శమూర్తి మాత రమాబాయి అంబేద్కర్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు అన్నారు. మంగళవారం మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయనకు తోడుగా రమాబాయి ఉన్నారన్నారు. ఆమె జీవితమంతా కష్టాలతోనే కొనసాగిందని కన్న కుమారుడు మరణిస్తే తెల్ల గుడ్డ లేని పరిస్థితిలో ఆమె పెళ్లికి సంబంధించిన తెల్ల గుడ్డను కుమారుని మృతదేహంపై కప్పిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎదుగుదల వెనుక ఉన్న మహాశక్తి రమాబాయి అని కొనియాడారు. మహిళలు రమాబాయిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్ ,ప్రధాన కార్యదర్శి చిట్యాల కరుణాకర్, బద్ది మురళి, గోరుమంతల నారాయణ, బలవంతులు సురేష్, తిరుపతి నాయక్, సామల దశరథం, ఉయ్యాల శేఖర్, గంధం వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post