మరమ్మత్తు పనులు వేగవంతం

రాజేందర్‌ నగర్‌ ప్రజాబలం ప్రతినిధి: రాజేంద్ర నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల కేంద్రంలోని మనికొండ మునిసిపల్‌ కౌన్సిల్‌ 8 వ వార్డ్‌ అల్కాపుర్‌ టౌన్‌ షిప్‌ రోడ్‌ నెంబర్‌ 30 లో ఈ మధ్య డాంబర్‌ రోడ్‌ మొదటి లేయర్‌ వేయడం జరిగినది అట్టి రోడ్‌ నాణ్యతపై కలత చెందిన కాలనీ వాసులు వార్డ్‌ కౌన్సిలర్‌ ఆలస్యం నవీన్‌ కుమార్‌ కు పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కౌన్సిలర్‌ హుటా హుటిన అక్కడకు వెళ్లి విషయ సేకరణజేయగా ప్రక్కనే భారీ కాంప్లెక్స్లకట్టడ నిమిత్తం అసంపూర్తిగా మొదటి లేయర్‌ వేసి ఉన్న రోడ్‌ పై మట్టిలోడ్‌ లారీలు వెళ్ళడం కారణంగా కాస్తమేర రోడ్‌ దెబ్బతిన్నదని అట్టి రోడ్‌ రెండవ లేయర్లో మరమ్మత్తు జరుగుతుంది కానీ మట్టి లారీల దుమ్ము ధూళి కణాల వల్ల అక్కడి ప్రజలు ప్రత్యేకంగా పిల్లలు చాలా ఇబ్బందుల పాలౌతున్నారని గమనించి పరిష్కార దిశగా కాంప్లెక్స్లకట్టడమ్‌ వారి సూపర్‌ వైజర్‌ ను పిలిచి లారీలు వెళ్ళే ప్రొద్దస్తమానము రోడ్‌ ను నీటితో తడిపి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని, ఈ తరువాతను ఇబ్బంది కలిగితే తనకు వెంటేనే తెలుపాలని ప్రజలందరికీ తెలియ జేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఆలస్యం నవీన్‌ కుమార్‌ కు సంఫీు భావం తెలిపిన వారిలో సహచర కౌన్సిలర్‌ పద్మారావు, బీ ఆర్‌ ఎస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్‌ నాయకులు అందె లక్ష్మణ్‌ రావు, జయరాజ్‌, గంగాధర్‌ శాస్త్రీ, దిలీప్‌, టోనీ, స్థానికులు మూర్తి, జార్జ్‌, గురుకుల నవీన్‌, శ్రీనివాస్‌, సూరజ్‌ ఆదిగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking