పార్లమెంటును ముట్టడిస్తాం

 

చట్టసభల్లో రిజర్వేషన్లు సాధిస్తాం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ

పెద్దపల్లి ప్రజాబలం ఫిబ్రవరి 7÷

చట్టసభలలో వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు పొందేందుకు పోరాటాలు ఉధృతం చేస్తామని జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరు శ్రీమన్నారాయణ తో పాటు జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి హనుమంతు లు పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చలో ఢిల్లీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా వారి ఇరువురు పాత్రికేయులతో మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లా కేంద్రం నుండి వందలాది మందితో పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళుతున్నట్లు శ్రీమన్నారాయణ, దాసరి హనుమయలు తెలిపారు. వెనుకబడిన తరగతుల ఉద్యమంలో దేశ వ్యాప్తంగా బీసీ నినాదం బలోపేతం చేసే దిశలో పోరాటాలకు రూపకల్పన జరుగుతుందని తెలిపారు. దేశ రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా కనుమూణంగా బీసీల జనాభాకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీసీ జనగణన చేపట్టాలని సమాజంలో మన వాటా దక్కించుకోవాల్సిందేనని అన్నారు కేంద్ర ప్రభుత్వంలో బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి పెంచుతున్నట్లు వారు తెలిపారు .బీసీలపై క్రిమి లేయర్ ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడం విరమించాలని కోరారు

. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన బీసీ ఉద్యమాలు నిర్మాణం జరిగిందని తెలిపారు. బీసీ ఉద్యమాలు బలోపేతం చేసే దిశలో పలువురు బీసీ నాయకులతో ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు దాసరి హనుమంతు కట్ట నరేందర్, జెట్టి సతీష్, శ్రీనివాస్ గౌడ్, సాగర్, శ్రీనివాస్, స్వరూప శ్రావణ్ ,రాకేష్ వెంకటేశ్వర్లు లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking