మలక్‌ పేట నియోజకవర్గంలోని సైదాబాద్‌ లోని డబుల్‌ బెడ్రూం లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..

ఎల్‌బీ నగర్‌ మలక్‌ పేట ప్రజాబలం ప్రతినిధి: పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్‌ బెడ్రూం లు ఎన్ని.. ఇంకా పెండిరగ్‌ వర్క్స్‌ ఏమున్నాయి..
డబుల్‌ బెడ్రూం లలో ఉన్న గదులు వంట రూం తదితర వాటిని పరిశీలించారు..
ఇప్పటికే డబుల్‌ బెడ్రూం లలో నివాసం ఉంటున్న వారితో మాట్లాడారు.. వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు..
చంచల్‌ గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజి నూతన భవనాన్ని పరిశీలించారు..
భవనం పూర్తయినప్పటికీ ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే బాలల..
విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు..

కాలేజి సమస్యలు పరిష్కారం చేస్తామని అందరూ బాగా చదువుకోవాలని సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..
కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా , రోడ్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్రెడ్డి రాంరెడ్డి , మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దాన కిషోర్‌ ,జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురషెట్టి , ఏంఆర్డిసిఎల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గౌతమి ,ఇతర మూసి డెవలప్మెంట్‌ అధికారులు
మంత్రి పొన్నం ప్రభాకర్‌, హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ
స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కలిసి పిల్లి గుడిసెలు డబుల్‌ బెడ్రూం లను పరిశీలించడం జరిగింది..
వాటి పరిస్థితి చూసి ఇక్కడ ఉంటున్న వారికి డబుల్‌ బెడ్రూం లు ఇవ్వడంతో పాటు హైదరాబాద్‌ లో ఉన్న వారికి డబుల్‌ బెడ్రూం లు ఇవ్వాలని ఆలోచన ఉంది వాటిని ఎంత వీలైతే అంత భవిష్యత్‌ లో తీసుకున్న ఇందిరమ్మ ఇల్లతో ముందుకు వెళ్తాం..
మూసీ పాత నగరం గా కాకుండా పురోగతి చెందే నగరంగా మూసి రూపుదిద్దుకుంటుంది..
మూసి ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక , పారిశ్రామిక , పర్యావరణ ,నీటి ఇబ్బందులు లేకుండా అందమైన టూరిజం ప్రాంతంగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి ప్రణాళికలు తో ముందుకు వెళ్తున్నాం..

పునరావాసం కింద నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది లేదు నష్టం లేకుండా చూస్తున్నాం.. అందరికీ రీహబిటేషన్‌ జరుగుతుంది
అందరూ సహకరించాలి.. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం ద్వారా నష్టపోతున్నమని భావిస్తున్నారో
అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి..
హైదరాబాద్‌ కొత్త ఇనోవేటెడ్‌ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం
మూసి ప్రక్షాళన ,మూసి పునః నిర్మాణం మూసి భవిష్యత్‌ ప్రణాళికల తో పోతున్నాం..
ఎవరికి అన్యాయం చేయలేని ఆలోచన లేదు..ఎవరికైనా మిస్‌ అయిన స్థానిక నాయకులతో కలిసి వారికి అండగా ఉంటాం..
అన్ని రకాలుగా సహకరిస్తం..
హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మూసి ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా ముందుకు పోతున్నం
ఇప్పటికే ఇళ్లలోకి పోయిన వారు చాలా కంఫర్ట్‌ గా ఉన్నారు…
వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు..
ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలోని వనస్థలిపురం జై భవాని నగర్‌ లో ఉన్న డబుల్‌ బెడ్రూం లను పరిశీలిస్తున్న హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌
– హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసి ప్రక్షాళనకు కార్యక్రమం చేపట్టింది.
– మూసి ప్రక్షాళనతో పాత నగరానికి పునర్వైభవం తీసుకొస్తాం.
– మూసి పరివాహక ప్రాంతంను సాంస్కృతికం, పర్యావణం, పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
– మూసి అభివృద్ధి ప్రాజెక్టు లో నిర్వాసితులైన వారికి నూటికి నూరుశాతం పునరావాసం కల్పిస్తాం.
జీహెచ్‌ఎంసీ హెచ్‌ఎండీఎ పరిధిలో నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి, ఆదాయం పెంచే కార్యక్రమాలను చేపడతాం.
-మూసి అభివృద్ధి ప్రాజెక్టు అమలుకు పరివాహక ప్రాంత ప్రజలు సహకారం అందించాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking