మణికొండలో హైడ్రా అవుసరం.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 ఆగస్టు 2024.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అధికారులు తలపెట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్న దరిమిలా ప్రజలంతా వారి చర్యలను పూర్తిగా సమర్థిస్తూ ప్రశంశలు అందిస్తున్నారని, రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఖానాపూర్, గండిపేట పరిధిలోని ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ లల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వెలిసిన వ్యాపార సముదాయాలన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు మునిసిపల్ కౌన్సిల్ అధికారుల సహకారంతో పోలీసు సిబ్బంది బందోబస్తు మధ్య ఉక్కు పాదంతో నేలమట్టం చేయడం జరిగిందని అట్టి సమయంలో అధికారులకు భవన యజమానులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొవడం, ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వలన కూల్చివేతలకు అడ్డు వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకునడం జరిగినదని, హైడ్రా తలపెట్టిన ఇట్టి కార్యక్రమానికి మద్దతు పలుకుతూ ది సిటిజన్స్ కౌన్సిల్ తరపున హైడ్రా కమిషనర్ ను కలసి హెచ్.ఎం.డీ.ఏ అనుమతులతో మణికొండలో ఏర్పడిన ప్రతి కాలనీలో ఉన్న ఆట స్థలాలను, ఉద్యానవనాలను, పందెం వాగు నాలా పరిసర ప్రాంతాలను కబ్జాకోరుల కబంధ హస్తాలలో ఉన్న స్తల వివరాలను వివరముగా తెలియ చేసి వాటిని రక్షించి ప్రజా సౌకర్యార్థం ముందుకు సాగుతామని ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు ఏకాభిప్రాయం తెలియజేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking