ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17 : పరీక్షలనేవి మనల్ని భయపెట్టడానికి కాదని,మన నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికలని,ఇలాంటి ఒత్తిడి భయానికి గురికాకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలని జిల్లా అదనపు పాలనాఅధికారి ఐఏఎస్ బి రాహుల్ తెలిపారు.లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ శనివారం రోజు నిర్వహించిన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు రానున్న పదవ తరగతి పరీక్షల పట్ల అవగాహన ప్రేరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు ప్రసంగించారు.జిల్లా విద్యాధికారి యాదయ్య మాట్లాడుతూ… రానున్న నెల రోజులు చాలా కీలకమని,పక్కా ప్రణాళికతో సిద్ధమైతే నూరు శాతం ఫలితాలు సాధ్యం అవ్వడమే కాక,అత్యుత్తమ జిపిఏ కూడా సాధించగలుగుతామని, విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టుకుని చక్కటి ప్రణాళిక ద్వారా రానున్న పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు తీసుకురావాలని దాని కొరకు విద్యాశాఖ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గంగన్న,మంచిర్యాల డిఎల్పిఓ ధర్మారాణి,లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కే రాజశేఖర్ లక్షెట్టిపేట మండల ఎం పి ఓ కె విజయ ప్రసాద్ జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు చౌదరి సత్యనారాయణ మూర్తి, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ దామోదర్ రావు.డి సి ఈ బి సెక్రటరీ కొండు భీమ్రావు జిల్లా సైన్స్ అధికారి ఎస్ మధు బాబు,డిసిఇబి అసిస్టెంట్ సెక్రటరీ కుమార స్వామి, ప్రముఖ సైకాలజిస్ట్ మహిపాల్,వివిధ సబ్జెక్టుల విషయ నిపుణులు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.