భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

 

మున్సిపల్ చైర్మన్ కాంతయ్య

సమ్మక్క – సారక్క గద్దెల పరిశీలన

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17 : సమ్మక్క – సారక్కకు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఇటిక్యాల గోదావరి ఒడ్డున ఉన్న సమ్మక్క – సారక్క గద్దెలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…జాతరకు వచ్చే భక్తులు గోదావరి వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం తరపున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న,ఆలయ కమిటీ చైర్మన్ నిమ్మ రత్నాకర్, చాతరాజు రాజన్న,షేక్ చాంద్,దొంత నర్సయ్య, గోల్కొండ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking