ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో ఇవిఎం ల ఫస్ట్ లెవల్ చెకప్ సజావుగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఇవిఎం, వివిప్యాట్ గోడౌన్ ను సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకప్ లో తిరస్కరణకు గురయిన ఇవిఎం ల మరమ్మత్తులకు కంపెనీకి ఎస్కార్ట్ భద్రతతో తరలించారు. తిరస్కరణకు గురయిన ఇవిఎంలు కంపెనీకి వెళ్ళువరకు మార్గమధ్యలో ఎక్కడ వాహనాలు ఆపకూడదని బాధ్యులతో కలెక్టర్ అన్నారు. అనంతరం గోడౌన్ లో ఫస్ట్ లెవల్ చెకప్ అనంతరం భద్రపరచిన ఇవిఎం, వివిప్యాట్ల గదుల తాళాలు, సీళ్ళను కలెక్టర్ పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పరిశీలించాలన్నారు. భద్రతా సిబ్బందికి సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, టాయిలెట్, వసతుల గురించి అడిగారు. భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ హుస్సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి నల్లమోతు తిరుమలరావు, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి చీకటి రాంబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సింగు రాజయ్య, టిడిపి పార్టీ ప్రతినిధి పాలడుగు టిఆర్ కృష్ణప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.