అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 17 (ప్రజాబలం) ఖమ్మం
యాదవ కులానికి గుర్తింపునిచ్చి అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సీటు ఇచ్చి, సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పెద్దలకు అఖిలభారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా అఖిలభారత యాదవ మహాసభ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతాపూర్వక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలు ఇస్తానని, యాదవులను, కురుమలను కోటీశ్వరులను చేస్తానని అభివృద్ధి చేస్తానని వాగ్దానాలు చేయడంవల్ల , కురుమ యాదవులు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో గెలిపించడం జరిగిందని, ఏరు దాటాక తప్ప తగలేసినట్లుగా, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది యాదవ కురుమల జనాభా ఉంటే కేవలం 3 లక్షల మందికి గొర్రెలను ఇచ్చి చేతుల దులుపుకొని డీడీలు కట్టించుకుని మిగతా వారికి గొర్రెలను ఇవ్వకుండా మోసం చేయడం జరిగిందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగిందని,ఏది ఏమైనా బి ఆర్ యస్ ప్రభుత్వాన్ని ఓడించాలని సంకల్పంతో కురుమ యాదవులు ఏకత్రాటిపై నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవడంజరిగిందని, తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అధికార పార్టీ అండదండలతో అనేక అవకతవకలు జరిగాయి. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో యాదవులు కురుమలకు చట్టసభలలోగాని, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులలో గాని ప్రాతినిధ్యం కల్పించాలని, డీడీలు కట్టిన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో దుబాకుల వెంకటేశ్వర్లు, బమ్మిడి శ్రీనివాస్, సత్తి వెంకన్న, చేతుల నాగేశ్వరరావు, జోన బోయిన పాపయ్య, గూదే భద్రయ్య, రాచబంటి రవి, పొదిల పెద్ద పాపారావు, కాల్వ నరసింహారావు పొదిల నరేష్, చింతల ఉపేందర్ పొదుల బిక్షం తదితరులు పాల్గొన్నారు