కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిది లోని హుస్సేనపూర్ శివారు తేట్టే కుంట దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు పశువులు కట్టేసి ఉన్న దగ్గర అగ్గిని రాజేశారు. దానివల్ల పుల్లే మల్లేష్ యాదవ్ కు చెందిన ఆవు చనిపోయింది మరియు మిగతా పశువులకు గాయాలు అయినాయి 1500 గడ్డి మోపులు కాలిపోయాయి. దీనివల్ల దిక్కుతోచని స్థితిలో కుటుంబం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీస్ అధికారులు దొంగలను తక్షణమే పట్టుకోవాలని, మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పరమశించారు. పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని , మేము కూడా ప్రభుత్వ అధికారులకు సమస్యను వివరించి న్యాయం చేస్తామని , నష్టపరిహారం అందేలా చూస్తామని అన్నారు.