పాఠశాల విద్యార్థులకు మొబైల్ వినియోగం,గుడ్ టచ్,బ్యాడ్ టచ్, చదువు ప్రాముఖ్యత గురించి షీ టీమ్ ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమము
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈ రోజు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల. గారి ఆదేశాల మేరకు పుల్సి గ్రామం, కుబీర్ మండలంలో జెడ్ పి హెచ్ ఎస్.పాఠశాల మహిళలు మరియు పిల్లల భద్రత గురించి షీ టీమ్ ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించరు.
ఈ సందర్బంగా.సోషల్ మీడియా నేరాలు వాటి బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఆడవాళ్లు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలు వాటి శిక్షలు, బాలల సంరక్షణ-వారి హక్కులు,సైబర్ నేరాలపై అవగాహన సోషల్ మీడియా నేరాలు గురించి, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోకూడదు. పాస్వర్డ్స్ అకౌంట్ గురించి ఎవరికీ చెప్పకూడదు,ఫోటోలు వీడియోస్ పోస్ట్ చేసేపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,ఒకవేళ సోషల్ మీడియా హరస్మెంట్ కి గురి ఐతే వెంటనే పోలీస్ లకి డైయిల్ 100 లేదా షి టీం నెంబర్ కు 8712659550.కాల్ చేయాలని తెల్పినారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుమలత, ప్రధాన ఉపాధ్యాయులు సురేష్, ఉపాధ్యాయులు,200 మంది విద్యార్థులు మరియు షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.