నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులను పునరుద్ధరించాలని కలెక్టర్ కు వినతి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
దేశ స్వాతంత్ర సమరయోధులు, భరతరత్న మానవతవాది,దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారకారతం నిర్మల్ పట్టణంలోని మౌలానా ఆజాద్ లో నిర్మిస్తున్న స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులను పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లకు వేరువేరుగా వినతి పత్రాలను సమర్పించారు.జిల్లా కలెక్టర్ అదనపు, కలెక్టర్లు సానుకూలంగా స్పందించి పనులు వెంటనే ప్రారంభించి క్లాక్ టవర్ నిర్మాణ పనులను శోభయమానంగా చేపట్టేలా.నాణ్యతతో పనులు జరిగేలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కలాం గుణం ఎడ్యుకేషనల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ వ్యవస్థాపకులు,అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, పట్టణ ప్రధాన కార్యదర్శి శేఖ్ ఇంతియాజ్ ,కోశాధికారి శేఖ్ షాదుల్లా హుస్సేన్, ప్రధాన కార్యదర్శి జుబేర్ హుస్సేన్ ఖాన్,ముఖ్య సలహాదారులు అబ్దుల్ ఖదీర్,పట్టణ అధ్యక్షులు షకీల్ అహ్మద్, మహమ్మద్ ఇస్మాయిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.