మేడారం ప్రసాదం ( బంగారం )ఇంటి వద్దనుండే బుక్ చేసుకునే సౌకర్యం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

మేడారం బంగారం ఇంటి వద్దకే
18.02.2024 నుండి 25 02.2024 వరకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తుల సౌకర్యర్టం టి.ఎస్.ఆర్టీసీ.లాజిస్టిక్స్ మరియు దేవాదాయ శాఖ ఒప్పందం మేరకు భక్తుల కొరకు మేడారం ప్రసాదం ( బంగారం )ఇంటి వద్దనుండే బుక్ చేసుకునే సౌకర్యం కలిపిస్తున్నారు.
మేడారం ప్రసాదం ( బంగారం ) బుక్ చేసుకోవాలంటే భక్తులు ఆదిలాబాద్ రీజియన్ లోని అన్ని డిపోల పరిధి లో గల గుర్తించ బడిన లాజిస్టిక్ కౌంటర్ లలో సంప్రదించ వలసి ఉంటుంది.భక్తులు పే టి.ఎమ్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.ప్రసాదం రేటు కేవలం 299/-మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవాలని డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు.
ఈ ప్రసాదాన్ని బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అయిన తర్వాత మా సిబ్బంది మీ యొక్క ఇంటివద్దకే తీసుకు రావడం జరుగుతుందని,మీరు ఎటువంటి అదనపు చార్జీలు ఇవ్వనవసరం లేదని,ప్రసాదం తో పాటు అమ్మవారి పసుపు కుంకుమ అందజేయడం జరుగుతుందని ఆదిలాబాద్ రీజియన్ లాజిస్టిక్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి.శ్రీనివాస్ తెలిపారు.
మేడారం ప్రసాదం ( బంగారం )బుకింగ్ కొరకు సంప్రదించవలసిన పూర్తి వివరాలు ఆదిలాబాద్ రీజియన్ లోని ఆయా డిపో ల ఎగ్జిక్యూటివ్ ల నంబర్ల కు పోన్ చేసి బుక్ చేసుకోగలరు.
1)ఆదిలాబాద్,ఉట్నూర్. 9154298531
2)నిర్మల్,బైంసా 9154298547
3)అసిఫాబాద్ 9154298534
4)మంచిర్యాల 9154298541
ఆర్.ఎమ్.ఆపీసు
ప్రశాంత్ 9154298552
సాయన్న 9154298553
నంబర్లలో సంప్రదించ గలరని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking