ఘనంగా తిరుమలయ్య జాతర ఉత్సవాలు పాల్గొన్న మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావ్
మెదక్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా నిజాంపేట
మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శ్రీ తిరుమల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమికి తిరుమలస్వామి వేడుక బ్రహ్మోత్సవాల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిట్ల సాయి బాబా ముదిరాజ్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ తిరుమల నాథ స్వామి గోదాలక్ష్మి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం బండ్ల ఉరేగింపుతో స్వామి వారి కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ స్వామి కల్యాణానికి విచ్చేసిన భక్తులకు, అధికారులకు, పాలకవర్గానికి రథసప్తమి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలస్వామి దేవాలయం అభివృద్ది కృషి చేస్తామన్నారు. అలాగే చల్మెడ తిరుమల దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి, దేవాలయ ఈఒ మోహన్ రెడ్డి, ఎసిపి నర్సింహ్మరెడ్డి, శ్యామ్ రాజు, సాయిబాబా, ఎల్లాగౌడ్, వడ్ల లక్ష్మి, తుమ్మల రమేష్, రాజిరెడ్డి, కాకి రాజయ్య, వెంకట రామ్మోహన్ శర్మ, నసీరుద్దీన్, పంజా మహేందర్, వినోద్, ఆకుల బాలయ్య, మోహన్ రెడ్డి ముత్యాల మధుసూదన్ రెడ్డి,ముత్యంరెడ్డి, బజార్ శ్రీకాంత్ గౌడ్,సత్యనారాయణ రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,శేఖర్,అధికారులు పాల్గొన్నారు.
